యజమాని లేని సమయం చూశారు.. రూ.19 లక్షల చోరీ.. పనిమనుషుల అరెస్ట్..

యజమాని లేని సమయం చూశారు.. రూ.19 లక్షల చోరీ.. పనిమనుషుల అరెస్ట్..

జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్​ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో రూ.19 లక్షల నగదు ఎత్తుకెళ్లిన ఘటనలో ఆ ఇంటి పనిమనిషి సైదమ్మ, ఆమె మైనర్ కుమార్తెతో పాటు అక్కడ పని చేసే మరో పనిమనిషి దేవకుమార్ పాత్ర ఉన్నట్లు పోలీసులు తేల్చారు. సదరు వ్యాపారవేత్త ఇంట్లో గతేడాది ఏప్రిల్ 24న రూ.40 వేల నగదు మాయమవగా, ఆ సమయంలోనే మైనర్ బాలిక దొంగతనం చేసినట్లు ఒప్పుకుని తిరిగి ఇచ్చేసింది. 

తాజాగా అదే నివాసంలో రూ.19 లక్షలు మాయమవడంతో, ఇంట్లో పనిచేస్తున్న వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బోరబండ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సైదమ్మ, ఆమె కుమార్తె, దేవకుమార్​ను అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించారు. యజమాని లేని సమయం చూసి వీరంతా కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. వీరి వద్ద నుంచి ఇప్పటివరకు రూ.8 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్​కు తరలించారు.